Polavaram: పోలవరం వెళ్తున్న తెదేపా నేతల అడ్డగింత.. పోలీసులతో వాగ్వాదం
పోలవరం పర్యటనకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన తెదేపా నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

గోపాలపురం: పోలవరం పర్యటనకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన తెదేపా నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. దీంతో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదుపులోకి తీసుకొనే సమయంలో తెదేపా నేతలు ప్రతిఘటించడంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసులను దాటుకొని ద్విచక్రవాహనంపై పోలవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టాయిగూడెం పీఎస్‌కు తరలించారు. తెదేపా నేతలను గోపాలపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు తెదేపా నేతలు పోలవరం వస్తున్నారనే సమాచారంతో అడ్డుకోవడానికి పోలవరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..
-
Indian Air Force: వాయుసేన చేతికి తొలి సీ-295 విమానం..!
-
CTET results: సీటెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి