హాథ్రస్‌ బాధితురాలి కోసం ప్రియాంక ప్రార్థనలు

అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచిన హాథ్రస్‌ బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ దిల్లీలో వాల్మీకి మహర్షి ఆలయంలో.........

Updated : 02 Oct 2020 19:49 IST

దిల్లీ: అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచిన హాథ్రస్‌ బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ దిల్లీలో వాల్మీకి మహర్షి ఆలయంలో శుక్రవారం ఆమె ప్రార్థనలు నిర్వహించారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ యూపీ ప్రభుత్వం, పోలీసులు దారుణంగా వ్యవహరించారని అన్నారు. బాధితురాలి అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు సరిగా నిర్వహించలేకపోయారని చెప్పారు. ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఇదే ఆలయంలో గాంధీజీ 214 రోజులు గడిపారని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాము సైతం గాంధీ మార్గాన్నే అనుసరిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని