Kodandaram: ధరణిలో లోపాలను సవరిస్తామంటే భయమెందుకు?: కోదండరామ్‌

ధరణి పోర్టల్‌పై సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.

Published : 04 Nov 2023 21:19 IST

హైదరాబాద్: ధరణి పోర్టల్‌పై సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని అనడం లేదని.. అందులోని లోపాలను సరిదిద్ది నూతన విధానం తీసుకొస్తామని వెల్లడించారు. ధరణిలో తప్పులను సవరిస్తామంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలు, లోసుగలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. మీరు సిద్ధమా అని కోదండరామ్‌ సవాల్‌ విసిరారు. ‘తెలంగాణ ఎన్నికలు-ప్రజల ఆకాంక్షలు’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో కోదండరామ్‌ మాట్లాడారు.

‘‘ధరణిలో అనేక లోపాలున్నాయి. పరిష్కారం లేని చిక్కుల్లో పడేసి రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. అధికారం మొత్తం తన చేతుల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎవరి పని వాళ్లు చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో అడ్డగోలుగా భూసేకరణ జరుగుతోంది. ధరణిని సవరించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చే దిశగా పోరాటం చేస్తాం. రైతుకు భూమి మీద హక్కు, రక్షణ ఉండాలి’’ అని కోదండరామ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని