NTR: ఎన్టీఆర్‌ స్మారక నాణెం.. రికార్డు స్థాయిలో అమ్మకాలు

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్‌ స్మారక నాణెం విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.

Updated : 18 Nov 2023 20:35 IST

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో తయారైన ఎన్టీఆర్‌ స్మారక నాణెం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. మార్కెట్‌లోకి విడుదలైన రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడయ్యాయి. దేశంలోనే ఇది సరికొత్త రికార్డు అని హైదరాబాద్‌లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం (ఇండియా గవర్నమెంట్‌ మింట్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వీఎన్‌ఆర్‌ నాయుడు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీఎన్‌ఆర్‌ నాయుడుతో పాటు మింట్‌ అధికారులు శ్రీనివాస్‌ గండపనేడు, తానాజీ పాల్గొన్నారు. వీఎన్‌ఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు ముద్రించిన వాటిలో రికార్డు స్థాయిలో 12వేలు అమ్మకాలు జరిగాయి. తాజాగా ఎన్టీఆర్‌ స్మారక నాణెం 25వేల అమ్మకాలతో ఈ రికార్డును అధిగమించింది’’ అని వివరించారు. దేశంలో ఇప్పటివరకు 200 స్మారక నాణేలను విడుదల చేయగా.. వాటిలో ఎన్టీఆర్‌ స్మారక నాణెం అత్యధిక విక్రయాలతో ప్రథమ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని ఎన్టీఆర్‌ సెంటినరీ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని