Revanth Reddy: తెరాస ఒత్తిడితోనే రాహుల్‌ పర్యటనకు అనుమతి నిరాకరణ: రేవంత్‌

తెలంగాణ ఉద్యమానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన చేశారని

Updated : 02 May 2022 15:49 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతి కోసం తమ పార్టీ నేతలు వీసీని కలిశారని.. అధికార తెరాస ఒత్తిడితో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖత్‌ అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన రాహుల్‌గాంధీ పర్యటనకు వీసీ అనుమతివ్వకపోవడం దుర్మార్గమని రేవంత్‌ విమర్శించారు. రాహుల్‌ పర్యటన అనుమతి కోసం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ ఓయూకి వెళ్లారని.. ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల సమస్యలు తీర్చే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని రేవంత్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని