Ap news: కృష్ణా జలాలపై ఎవరిది దాదాగిరి..?: సజ్జల

కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. ఎవరు దాదాగిరి

Published : 03 Aug 2021 01:11 IST

అమరావతి: కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. ఎవరు దాదాగిరి చేశారో అందరికీ తెలుసన్నారు. దాదాగిరి అంటే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని సముద్రానికి వదలడమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. జలవిద్యుత్‌ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రంపాలు చేశారని విమర్శించారు. జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ఎగువప్రాంతంలో ఉన్నామనే భావనతో జలవివాదం తెచ్చారని అన్నారు. సాగు అవసరాలను కాదని, విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగించరాదన్న నియమాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఏపీ నీటివాటా కాపాడుకునేందుకే సీఎం జగన్‌ ప్రయత్నించారని చెప్పారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని.. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు