Andhra news: వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించిన స్పీకర్‌

అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేల వినతిని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.

Published : 26 Jan 2024 18:59 IST

అమరావతి: అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేల వినతిని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈనెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే స్పీకర్‌కు నలుగురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. నోటీసుతో పాటు పంపిన పేపర్‌, వీడియో క్లిప్పింగ్‌లు అసలైనవో.. మార్ఫింగ్‌ చేసినవో నిర్ధరించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 30 రోజుల సమయం కుదరదని స్పీకర్‌ స్పష్టం చేశారు. నోటీసులతో పాటు పేపర్‌, వీడియో క్లిప్పింగ్‌లను ఎమ్మెల్యేల వాట్సాప్‌కు పంపామని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని