Atchannaidu: తెదేపా అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరిస్తాం: అచ్చెన్న

అంగన్‌వాడీ కార్యకర్తల (Anganwadi Workers) డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు.

Published : 13 Dec 2023 14:21 IST

అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తల (Anganwadi Workers) డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. అంగన్‌వాడీల న్యాయపోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ‘‘అంగన్‌వాడీపై ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) మోహన్‌ రెడ్డికి ఎందుకంత కక్ష? తెదేపా అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరిస్తాం’’ అని అచ్చెన్న హామీ ఇచ్చారు. మరోవైపు అంగన్‌వాడీల నిరవధిక సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు