Ts News: ఉపఎన్నికలు వస్తేనే తెరాస నాయకులకు జోష్‌ వస్తుంది: రాజాసింగ్‌

పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు...

Updated : 04 Nov 2021 16:32 IST

హైదరాబాద్: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిందని గుర్తుచేశారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పెట్టడానికి బలముండాలన్నారు. పెట్రోల్‌పై రూ. 41 పన్ను వసూలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం రూ.8 నుంచి రూ.10 తగ్గించాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఉపఎన్నిక వస్తేనే తెరాస నాయకులకు జోష్‌ వస్తుందని ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని