DK Aruna: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మజ్లీస్‌కు తాకట్టు పెట్టారు: డీకే అరుణ

సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మజ్లీస్‌కు తాకట్టు పెట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

Updated : 12 Oct 2022 15:37 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మజ్లీస్‌కు తాకట్టు పెట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. భాజపా 1998 నుంచే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. ఉద్యమసమయంలో అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. నియంతలకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు.  కేటీఆర్‌ గద్వాల్‌లో అవాకులు చెవాకులు పేలారని పేర్కొన్న డీకే అరుణ... గద్వాల్‌లో ఏడేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 17న నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన సభలో అమిత్‌ షా పాల్గొంటారని తెలిపారు. నిర్మల్‌ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.  మోదీ జన్మదినం సందర్భంగా ఈనెల 17నుంచి అక్టోబర్‌ 7 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు  చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని