AP News: తెదేపాను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతాం: బొత్స

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఏంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు...

Updated : 20 Oct 2021 12:01 IST

విజయనగరం: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఏంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నిన్న ఏపీలోని తెదేపా కార్యాలయాలపై దాడులు జరగడం.. ఇవాళ ఆ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.

‘‘భాజపాతో ఉన్నానంటూ చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ సమర్థన సిగ్గుచేటు. సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటి? తెదేపాను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతాం. మావోయిస్టు పార్టీకి, తెదేపాకు తేడా లేదు. తెదేపా చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది’’ అని బొత్స అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని