Revanth Reddy: రేవంత్‌ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం (హౌస్‌ అరెస్ట్‌) చేశారు.

Updated : 31 Dec 2021 14:20 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం (హౌస్‌ అరెస్ట్‌) చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి వెళ్లకుండా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే దీనిపై రేవంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిలేకుండా తన ఇంట్లోకి వచ్చారని పోలీసు అధికారులపై ఆయన మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని