
YS Sharmila: హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల పర్యటన
సిరిసేడులో నిరుద్యోగ దీక్ష చేపట్టిన వైతెపా అధ్యక్షురాలు
ఇల్లందకుంట: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్ షబ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. షబ్బీర్ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల అందులో భాగంగా ఇవాళ సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.