Telangana News: తెరాస శ్రేణుల మెరుపు ధర్నా.. స్తంభించిన ట్రాఫిక్‌

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై తెరాస శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టాయి. విజయవాడ హైవేపై చౌటుప్పల్‌ వద్ద మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర తెరాస నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 

Published : 27 Oct 2022 00:31 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీకి చెందిన వ్యక్తులు హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో నోట్లకట్టలతో పోలీసులకు చిక్కారు. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ ఘటనతో తెరాస శ్రేణులు చౌటుప్పల్‌లోని విజయవాడ హైవేపై మెరుపు ధర్నా నిర్వహించాయి. మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఇతర తెరాస నేతలు రహదారిపై బైఠాయించారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు భాజపా కుట్ర చేసిందంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాజపాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫలితంగా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై కిలో మీటర్లమేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బంజారాహిల్స్‌లోనూ మెయినాబాద్‌ ఘటన పట్ల తెరాస శ్రేణులు ఆందోళన చేపట్టాయి. భాజపాకు వ్యతిరేకంగా  పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని