CM KCR: దిల్లీలో తెరాస దీక్ష ప్రారంభం.. వేదికపై కేసీఆర్‌, రాకేశ్‌ టికాయత్‌

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస సర్కారు దిల్లీలోని తెలంగాణభవన్‌లో దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్‌ దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట భారతీయ

Updated : 11 Apr 2022 11:32 IST

దిల్లీ: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస సర్కారు దిల్లీలోని తెలంగాణభవన్‌లో దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్‌ దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయత్‌ ఉన్నారు. అంతకుముందు కేసీఆర్‌.. తెలంగాణ అమరవీరుల స్థూపం, అంబేడ్కర్‌, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లికి పుష్పాలు సమర్పించారు. వేదికపై కేసీఆర్‌, టికాయత్‌లతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా, రైతుబంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. 

దీక్షలో మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై తెరాస కేంద్రానికి అల్టిమేటం ఇవ్వనున్నట్లు సమాచారం. దీక్ష వేదికపై నుంచి కేసీఆర్‌.. తెరాస తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని