Telangana News: కేంద్రంతో పోరు.. తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణుల నిరసనలు

 ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. 

Updated : 04 Apr 2022 12:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ విషయంలో ఐదంచెల యాక్షన్‌ ప్లాన్‌ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు.

రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మంలోని మంచుకొండ ప్రధాన రహదారిపై మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని.. అంతవరకూ కొట్లాడుతామని తెరాస శ్రేణులు స్పష్టం చేశాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని