Kishan Reddy: తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్‌రెడ్డి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు. ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేసిన దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనేది భాజపా ఉద్దేశం.
రాష్ట్రంలో కుటుంబపాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. నేడు తెలంగాణ.. ఓ కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చింది. దొరికిన అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వట్లేదు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది? దళితబంధులో ఎమ్మెల్యేలు వాటా తీసుకుంటున్నారు. పేదలకు అండగా నిలిచే ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏమయ్యాయి? అమరవీరుల కుటుంబాల ప్రస్తుత పరిస్థితి ఏంటి?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు