NDA: ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో భాగం కావాలనుకుంటున్నారా?

ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజల ఆలోచనలను స్వీకరించేందుకు ఏపీలో ఎన్డీయే కూటమి ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను తీసుకొచ్చింది.

Updated : 08 Apr 2024 15:17 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్‌కు సూచనలను టెక్ట్స్‌ రూపంలో గానీ, వాయిస్‌ మెసేజ్‌, పీడీఎఫ్‌గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి అజెండా అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని