Devegowda: మీరు ప్రధాని కావడాన్ని కాంగ్రెస్‌ సహిస్తుందా? ఖర్గేకు దేవెగౌడ ప్రశ్న

తన పార్టీని నాశనం చేయాలనుకునే కొంతమంది కాంగ్రెస్‌ నేతల నుంచి కాపాడుకునేందుకే భాజపాకు మద్దతు తెలిపినట్లు జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు.

Published : 08 Feb 2024 22:44 IST

దిల్లీ: మీరు ప్రధాని కావడాన్ని కాంగ్రెస్‌ సహిస్తుందా? అంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Devegowda) ప్రశ్నించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) హైకమాండ్ సంస్కృతిపై విరుచుకుపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆ పార్టీలోని అగ్రనేతలు చేసిన తప్పిదాలకు బలైపోయారన్నారు. జేడీఎస్‌ను నాశనం చేయాలనుకునే కొంతమంది కాంగ్రెస్‌ నేతల నుంచి కాపాడుకునేందుకే భాజపాకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే? పలువురి నేతల ప్రతిపాదన!

ఖర్గేను మచ్చలేని వ్యక్తిగా అభివర్ణించిన దేవెగౌడ.. ఇటీవల ‘ఇండియా’ కూటమి ఛైర్‌పర్సన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ప్రతిపాదనకు వస్తే సొంతవారే ఎదురుతిరిగారన్నారు. 2019లో తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్‌ ప్రభుత్వం కూలిపోవడానికి కొంతమంది కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపించారు. రాష్ట్రానికి ఖర్గే ముఖ్యమంత్రి కావాలని తాను సూచించినప్పటికీ, కుమారస్వామికే అప్పగించాలని హస్తం పార్టీ అధిష్ఠానం పట్టుబట్టిందన్నారు. జీవిత చరమాంకంలో దేవెగౌడ తన రాజకీయ గమనాన్ని మార్చుకున్నారని ఖర్గే వ్యాఖ్యనించడంపై స్పందిస్తూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీవితంలో ఎప్పుడూ పార్టీ మారలేదని చెప్పారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని