YS Sharmila: బీఎన్‌ రెడ్డిలో వైఎస్‌ షర్మిల ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు

గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. బీఎన్‌రెడ్డిలో స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు.

Published : 20 Aug 2023 18:46 IST

హైదరాబాద్‌: గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే.. మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టా? రానట్టా?’’ అని షర్మిల ప్రశ్నించారు.

బీఎన్‌రెడ్డి నగర్‌లోని శ్యామ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితురాలు లక్ష్మిని వైఎస్‌ షర్మిల పరామర్శించారు. అనంతరం శ్యామ్‌ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి, స్థానికులతో కలిసి ధర్నా చేపట్టారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడితే స్వాతంత్ర్యాన్ని గౌరవించినట్లా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి 120 గజాల స్థలం ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారట.. కానీ, ఆ విషయం బహిరంగంగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాధితురాలికి వెంటనే రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నాతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వైఎస్‌ షర్మిలతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పీఎస్‌కు తరలించారు. అనంతరం లోటస్‌ పాండ్‌లోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు