పీఎస్‌ఎల్‌వీ-సి53లో నూతన సాంకేతికత

ఈనెల 30న పీఎస్‌ఎల్‌వీ-సి53ని నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో అదే సమయంలో నూతన అంశాలపై ప్రయోగం చేయనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌,

Published : 17 Jun 2022 05:48 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఈనెల 30న పీఎస్‌ఎల్‌వీ-సి53ని నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో అదే సమయంలో నూతన అంశాలపై ప్రయోగం చేయనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌, అమెరికా, కొరియా దేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన అనంతరం చివరిదైన నాలుగో దశలో రాకెట్‌ శకలాలుగా మారిపోతుంది. ఈసారి అలాకాకుండా రాకెట్‌ అందులో మిగిలి ఉండే ఇంధనం సాయంతోనే మరికొన్నేళ్లపాటు అంతరిక్షంలో తిరుగుతూ వివిధ అంశాలకు సంబంధించిన డేటాను అందించేలా సాంకేతికతను రూపొందిస్తున్నారు. ‘ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఈసారి రాకెట్‌లో మనదేశానికి చెందిన ప్రతిజ్ఞ్ఞను, జాతీయ జెండాను పొందుపరచి పంపనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని