Online games: తండ్రి ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌.. రూ.39 లక్షలు హుష్‌కాకి!

ఓ పిల్లాడు తన తండ్రి మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది ఈ ఘటన. తాజ్‌నాగ్రికి చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి

Updated : 24 Jun 2022 09:07 IST

ఓ పిల్లాడు తన తండ్రి మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది ఈ ఘటన. తాజ్‌నాగ్రికి చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. ఈ క్రమంలోనే ఆ పిల్లాడు తన తండ్రి మొబైల్‌లో బ్యాటిల్‌ గ్రౌండ్‌ అనే ఆన్‌లైన్‌ పెయిడ్‌ గేమ్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్‌ను ఆటోమోడ్‌లో పెట్టాడు. పిల్లాడు చాలా సార్లు గేమ్‌ ఆడాడు. ఆడిన ప్రతీసారి ఆటోమోడ్‌లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. అయితే కొన్ని రోజులకు పిల్లాడి తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్‌ చేయడానికి వెళ్లగా... రూ.39 లక్షలు మాయమైనట్లు గమనించారు. దీనిపై సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సింగపూర్‌లోని క్రాఫ్టన్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్‌ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని