Kerala: కేరళలోని దుకాణంలో ఆసక్తికరమైన చోరీ..
కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ దుకాణంలో ఆసక్తికరమైన చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు ఓ దుకాణంలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లారు. కనిపించినవల్లా తీసుకెళ్లకుండా తమ ఇంట్లోకి కావాల్సిన సామాను మాత్రమే దోచేశారు. గ్యాస్ స్టౌ, టేబుల్ మ్యాట్లు, గొడుగు వంటి వస్తువులను తీసుకెళ్లారు. ఏ వస్తువులు దొంగతనం చేయాలో ముందుగానే అంచనాకు వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అనుకున్న వస్తువులన్నీ చోరీ చేశాక.. ఒక దొంగ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న రూ.3వేల నగదు, ఓ మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిపోయాడు. వీరితో పాటు వచ్చిన మూడో వ్యక్తి దుకాణం బయట ఉన్నాడు. లోపలున్న దొంగలు తీసుకొచ్చిన వస్తువులను అతడు ఓ ఆటోలో నింపి తీసుకెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80వేల విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు దుకాణ యజమాని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
Politics News
Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
-
Politics News
jagadishreddy: మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Viral-videos News
Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ