ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ కన్నుమూత

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ బర్కిండో (63) మంగళవారం రాత్రి నైజీరియా రాజధాని అబూజాలో కన్నుమూశారు. వాతావరణ మార్పుల పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చమురు పరిశ్రమ వర్గాలకు

Published : 07 Jul 2022 06:20 IST

అబూజా: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ బర్కిండో (63) మంగళవారం రాత్రి నైజీరియా రాజధాని అబూజాలో కన్నుమూశారు. వాతావరణ మార్పుల పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చమురు పరిశ్రమ వర్గాలకు మద్దతుగా నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీతో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం ఉంది. మరణానికి కారణాలు తెలియరాలేదు. కొవిడ్‌-19 సంక్షోభానంతరం ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు ఆయన కీలక సేవలు అందించారని ఒపెక్‌ దేశాలు పేర్కొన్నాయి. బర్కిండో తమకు మిత్రునిగా ఉండేవారని భారత్‌ పేర్కొంది. ఆయన మృతి ప్రపంచ ఇంధన రంగానికే పెద్దలోటు అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని