Punjab Election 2022: సీఎం అభ్యర్థి సిద్ధూయా.. చన్నీయా..!

పంజాబ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్‌

Updated : 28 Jan 2022 11:07 IST

త్వరలోనే ప్రకటిస్తాం: రాహుల్‌ గాంధీ

జలంధర్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. గురువారం ఆయన జలంధర్‌లో వర్చువల్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన చేశారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకొనే అభ్యర్థి పేరును వెల్లడిస్తామని తెలిపారు. తమలో ఎవరి పేరును ప్రకటించినా.. కలిసి పనిచేస్తామని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని