‘బంతిపై తడి ఉన్నా యార్కర్లు వేయగలడు’

బంతిపై తడి ఉన్నా నటరాజన్‌ యార్కర్లు వేయగలడని టీంఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న టీట్వంటీ లీగ్‌లో

Published : 09 Oct 2020 01:28 IST

నటరాజన్‌ను ప్రశంసించిన బంగర్‌

దుబాయ్‌: బంతిపై తడి ఉన్నా నటరాజన్‌ యార్కర్లు వేయగలడని టీమ్‌ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో గురువారం పంజాబ్‌, హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నటరాజన్‌ గురించి బంగర్‌ మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో అంతే క్లిష్టమైన బంతులతో నటరాజన్‌ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టిస్తున్నాడని ప్రశంసించారు. ఈ క్రికెట్‌ ఫార్మాట్‌లో యార్కర్‌ బంతులు వేయటం కష్టమన్న బంగర్‌.. అది కూడా బంతిపై తడి ఉన్న సమయంలో వేయటం సాధ్యపడదని వివరించారు. ఈ క్రమంలో నటరాజన్‌ డెత్‌ ఓవర్లరో బౌలింగ్ చేస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. 

ఈ టీ20 లీగ్‌లో రషీద్‌ఖాన్‌తో పాటు నటరాజన్‌ అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో నిలుస్తారని బంగర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చీలమండల గాయం కారణంగా హైదరాబాద్‌ జట్టు ప్రధాన బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ లీగ్‌ అంతటికీ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జట్టుకు డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టు బౌలర్‌ విషయంలో ఆందోళన చెందుతోంది. నటరాజన్‌ రూపంలో హైదరాబాద్‌ జట్టుకు మంచి బౌలర్‌ దొరికాడని బంగర్‌ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే లీగ్‌కు దూరమైన భువీ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్‌ పృథ్వీరాజ్‌ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని