భారత్‌ సత్తా చాటింది: అక్తర్‌

అడిలైడ్‌లో ఘోర పరాభవం పాలైన టీమ్‌ఇండియా మెల్‌బోర్న్‌ టెస్టుతో తమ సత్తా నిరూపించుకుందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో బలంగా పుంజుకుందని చెప్పాడు...

Published : 28 Dec 2020 22:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌లో ఘోర పరాభవం పాలైన టీమ్‌ఇండియా మెల్‌బోర్న్‌ టెస్టుతో సత్తా చాటిందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో బలంగా పుంజుకుందని చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్‌లో మాట్లాడిన పేస్‌ దిగ్గజం తాత్కాలిక కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ జట్టు అయినా ఇలా సత్తా చాటితే తనకు ముచ్చటేస్తుందన్నారు. రహానె జట్టు బాధ్యతల్ని తనపై వేసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడని అక్తర్‌ ప్రశంసించాడు. 

‘‘భారత్‌ తిరిగి సత్తా చాటింది, దాంతో ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసింది. అడిలైడ్‌లో ఘోర ఓటమి తర్వాత భారత్‌ తిరిగి పుంజుకుందనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే కెప్టెన్‌గా రహానె మంచి పని చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడి వ్యూహాలు, ఫీల్డింగ్‌ మార్పులు అద్భుతం. ఈ మ్యాచ్‌కు ముందు అతడెంతో ఒత్తిడిలో ఉన్నాడు. అయినా ప్రశాంతంగా ఉంటూ తన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ల వ్యవహారశైలితోనే జట్లు మెరుగవుతాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో జడేజా, పంత్‌ బాగా ఆడారు. రహానె(112) శతకంతో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు’’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. 

ఇవీ చదవండి..
రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్
వార్నర్‌ మూడో టెస్టుకూ అనుమానమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని