AB devilliers: వచ్చే సీజన్లో మళ్లీ టీ20 లీగ్‌లోకి వస్తా..: ఏబీ డివిలియర్స్
వచ్చే సీజన్లో మళ్లీ టీ20 లీగ్‌లో కనబడతానని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చెప్పాడు. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఏబీ గతేడాదే టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే
జొహానెస్బర్గ్: వచ్చే సీజన్లో మళ్లీ టీ20 లీగ్‌లో కనబడతానని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చెప్పాడు. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఏబీ గతేడాదే టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే వచ్చే సీజన్లో కొత్త పాత్రలో తిరిగి బెంగళూరుతో చేరే అవకాశాలున్నాయి. ‘‘నేను తిరిగి టీ20 లీగ్‌కు వస్తానన్న విషయాన్ని స్నేహితుడు విరాట్ ముందే రూఢి చేసినందుకు సంతోషం. నిజం చెప్పాలంటే ఈ విషయంపై ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. కానీ కచ్చితంగా వచ్చే ఏడాది టీ20 లీగ్‌లో కనిపిస్తానని నమ్ముతున్నా. అయితే ఏ పాత్రలో అనేది ఇంకా తెలియదు. వచ్చే ఏడాది బెంగళూరులోనూ కొన్ని టీ20 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయని తెలిసింది. నా రెండో సొంతగడ్డకు రావడానికి తహతహలాడుతున్నా. కిక్కిరిసిన చిన్నస్వామి స్టేడియాన్ని మళ్లీ చూడాలని ఉంది’’ అని ఏబీ చెప్పాడు. బెంగళూరు తరఫున డివిలియర్స్ 39.71 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధసెంచరీలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!