Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు గట్టి షాక్‌.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం

ఆసియా కప్‌లో సూపర్‌-4కు చేరిన బంగ్లాదేశ్‌కు గట్టి షాక్‌ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (Najmul Hossain Shanto) టోర్నీలో మిగిలిన అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

Published : 06 Sep 2023 02:09 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో సూపర్‌-4కు చేరిన బంగ్లాదేశ్‌కు గట్టి షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (Najmul Hossain Shanto) తొడ కండరాల గాయం కారణంగా టోర్నీలో మిగిలిన అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన నజ్ముల్ గాయం కారణంగా ఫీల్డింగ్ చేయలేదు. స్కానింగ్‌లో కండరానికి గాయం అయినట్లు తేలింది. నజ్ముల్ స్థానంలో లిటన్ దాస్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆసియా కప్‌లో ప్రారంభంలో అనారోగ్యానికి గురై జట్టుకు దూరమైన లిటన్ దాస్ ప్రస్తుతం కోలుకుని లాహోర్‌లో టీమ్‌తో కలిశాడు. 

వన్డే ప్రపంచకప్‌లో మన ఆటగాళ్లు ‘టీమ్‌భారత్’ జెర్సీలు ధరించాలి: వీరేంద్ర సెహ్వాగ్

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. అప్పటిలోపు నజ్ముల్‌ హుస్సేన్ శాంటోను జట్టులోకి తీసుకొచ్చేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఆసియా కప్‌లో గ్రూప్‌ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 164 పరుగులకు ఆలౌటైంది. శాంటో (89) పోరాడకుంటే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉండేది అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంటో (104; 105 బంతుల్లో) చెలరేగి శతకం సాధించాడు. సూపర్‌-4 మ్యాచ్‌లకు అతడు దూరమవడం బంగ్లాకు గట్టి దెబ్బే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని