Asia Cup 2023: టీమ్‌ఇండియా జట్టు ప్రకటనకు డేట్ ఫిక్స్‌! అతడిపై వేటు తప్పదా?

ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరిగే ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) కోసం టీమ్‌ఇండియా యాజమాన్యం ఆగస్ట్‌ 20న జట్టును ప్రకటించే అవకాశముంది.

Updated : 17 Aug 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమ్‌ఇండియా (Team India) మేనేజ్‌మెంట్ కూడా జట్టు ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 20న జట్టును ప్రకటిస్తారని వార్తలొస్తున్నాయి. రోహిత్‌ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా ఆసియా కప్‌లో ఆడనుంది. వెస్టిండీస్ టూర్‌లో యువ ఆటగాడు సంజు శాంసన్‌ (Sanju Samson)కు  కావల్సినన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో అతడిపై సెలక్టర్లు వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎప్పుడొస్తావ్‌ పంత్‌.. పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ!

ఐపీఎల్‌లో గాయపడి ప్రస్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్న కేఎల్ రాహుల్‌ (KL Rahul)ను తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా కదులుతున్నాడని ఎన్‌సీఏ వర్గాల సమాచారం. ఎన్‌సీఏలో ఉన్న మరో బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఇంకా వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. అందుకే అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయకపోవచ్చు. వెన్నుగాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరమై ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)కు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కే అవకాశముంది. 
  
ఆసియా కప్‌.. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. పాకిస్థాన్‌తో సెప్టెంబరు 2న, నేపాల్‌తో సెప్టెంబరు 4న భారత్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని