Wasim Jaffer:పాకిస్థాన్‌ను వారి సొంత దేశంలో ఓడించడం సంతృప్తినిచ్చింది: వసీం జాఫర్‌

ఇటీవల బంగ్లాదేశ్ అండర్-19 జట్టు పాకిస్థాన్‌లో పర్యటించి మంచి ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Published : 20 Nov 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్ అండర్-19 జట్టు పాకిస్థాన్‌లో పర్యటించి మంచి ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగు రోజుల ఏకైక మ్యాచ్‌ను కూడా డ్రా చేసుకుంది. దీంతో బంగ్లాదేశ్‌ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా ఉన్న భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ బంగ్లా కుర్రాళ్ల ఆటతీరుపై సంతోషం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ను వారి సొంత దేశంలో ఓడించడం వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నాడు. కుర్రాళ్లు కనబరిచిన అద్భుతమైన ఆటతీరుని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. ఈ మేరకు జాఫర్‌ ట్వీట్‌ చేశాడు. వసీం జాఫర్‌ భారత టీ20 లీగ్‌లోని పంజాబ్‌ ఫ్రాంచైజీకి 2019 నుంచి 2021 వరకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. 2022లో వివిధ కారణాల వల్ల ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. వచ్చే సీజన్‌ కోసం తిరిగి అదే ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని