Euro cup: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌కు షాక్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌కు ఊహించని షాక్. యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌ ప్రిక్వార్టర్స్‌లో

Published : 28 Jun 2021 04:22 IST

సెవిల్లె: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌కు ఊహించని షాక్. యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌ ప్రిక్వార్టర్స్‌లో తడబడింది. నాకౌట్‌ మ్యాచ్‌లో ఆ జట్టు బెల్జియం చేతిలో ఓటమి పాలైంది. 1-0 తేడాతో బెల్జియం ఘన విజయం సాధించింది. త్రొగన్‌ హజార్డ్‌(42 నిమిషం) గోల్‌ కొట్టడంతో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఆధిక్యాన్ని ఆట చివరదాకా తీసుకెళ్లడంలో బెల్జియం సఫలమైంది. ఆటలో ఆధిపత్యమంతా పోర్చుగల్‌దే అయినప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఆ జట్టు ఆటగాళ్లు జారవిడిచారు. గోల్‌ లక్ష్యంగా పోర్చుగల్‌కు 4 అవకాశాలు వచ్చాయి. వాటిని గోల్‌గా మార్చడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇంకోవైపు ఓకేసారి గోల్‌ లక్ష్యం దిశగా వెళ్లిన బెల్జియం దాన్ని సద్వినియోగం చేసుకుంది. దీంతో రెండోసారి కప్‌ కొట్టేయాలని భావించిన పోర్చుగల్‌ ఓటమితో ఇంటిముఖం పట్టింది. ఇక బెల్జియం క్వార్టర్‌ ఫైనల్‌లో ఇటలీతో తలపడనుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని