Avesh - Pant : అవేశ్ ఖాన్‌కు ‘సారీ’ చెప్పిన పంత్‌... ఎందుకో తెలుసా?

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్ పంత్...

Published : 17 Feb 2022 02:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్ పంత్ ఫాస్ట్‌ బౌలర్ అవేశ్‌ ఖాన్‌కు ‘సారీ’ చెప్పాడు. ఇంతకీ అవేశ్‌కు రిషభ్‌ ఎందుకు క్షమాపణ చెప్పాడనేగా మీ డౌటు.. ఐపీఎల్‌ మెగా వేలంలో అవేశ్‌ ఖాన్‌ను తిరిగి దక్కించుకునేందుకు దిల్లీ ప్రయత్నించినా కుదరలేదు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లలో అవేశ్ ఖాన్‌ (రూ.10  కోట్లు) అధిక ధరను దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం కోల్‌కతా వేదికగా విండీస్‌తో టీమ్‌ఇండియా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. మ్యాచ్‌లకు అవేశ్‌ ఖాన్‌ ఎంపిక కావడంతో కోల్‌కతాకు వెళ్లాడు.

ఈడెన్‌గార్డెన్స్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌ను అవేశ్‌ ఖాన్‌ కలిశాడు. ఈ సందర్బంగా అవేశ్ ఖాన్‌ను పంత్‌ హగ్ చేసుకుని అభినందిస్తూనే క్షమాపణలు తెలిపాడు. ‘‘కోల్‌కతాలో దిగగానే నేను రిషభ్‌ను కలిశాను. నన్ను హగ్‌ చేసుకుని అభినందించాడు. తీసుకోలేకపోయినందుకు క్షమించు.. అని అన్నాడు. భారీ మొత్తం లేకపోవడంతో కొనుగోలు చేయడం కుదర్లేదని తెలిపాడు. అప్పటికీ రూ.8.75 కోట్ల వరకు దిల్లీ బిడ్‌ వేసింది. అయితే లఖ్‌నవూ ఇంకా అధికంగా ఆఫర్‌ చేసింది. అయితే ఇప్పుడు రిషభ్‌ను కలవడం ఎంతో భావోద్వేగం కలిగిస్తుంది. మేమిద్దరం కలిసి అండర్‌-19 క్రికెట్‌ కూడా ఆడాం. మ్యాచ్‌ ముగిసాక ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్లం’’ అని అవేశ్‌ ఖాన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని