రిటైర్మెంట్ తర్వాత ధోనీ తొలి పోస్ట్‌ ఇదే!

ఇతర క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు...

Published : 08 Jan 2021 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంటుంటాడు. అయితే గత ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహీ ఇన్‌స్టాలో మరో పోస్ట్ చేయలేదు. తన కెరీర్‌లో ముఖ్యమైన జ్ఞాపకాలతో ఓ వీడియో పోస్ట్ చేసి.. అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

అయితే ఎన్నో నెలల తర్వాత ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్నాడు. సేంద్రీయ పద్ధతుల్లో తాను పండిస్తున్న స్ట్రాబెర్రీని తింటూ వీడియో షేర్ చేశాడు. ‘పొలంలో ఇలానే నేను ముందుకెళ్తే.. మార్కెట్‌లో అమ్మడానికి ఒక్క స్ట్రాబెర్రీ కూడా మిగలదు’ అని దానికి సరదాగా వ్యాఖ్య జత చేశాడు. కాగా, పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నాలుగు గంట్లోనే 43 లక్షల మంది పైగా వీక్షించారు.

వీడ్కోలు పలికిన తర్వాత నుంచి ధోనీ తన జీవితాన్ని బిజీగా గడుపుతున్నాడు. గతేడాది రాంచీలో 2వేల కడక్‌నాథ్‌ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ప్రారంభించగా.. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. అంతేగాక పండించిన స్ట్రాబెర్రీ, క్యాబేజీ, టమోటా సహా ఇతర కూరగాయల్ని దుబాయ్‌కి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాడని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఇప్పటికే ధోనీ క్షేత్రంలో పండించే కూరగాయలకు రాంచీ మార్కెట్లో మంచి డిమాండు ఉంది.

ఇదీ చదవండి
రోహిత్, గిల్‌ ఏకాగ్రతను దెబ్బతీయాలని‌..

200+ డాడీ హండ్రెడ్‌ అయితే 300+ ఏంటి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని