
IND vs NZ: జేమీసన్ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయా : శుభ్‌మన్ గిల్
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయానని టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అతడు వేసిన రివర్స్ స్వింగ్ బంతిని అర్థం చేసుకోలేక బౌల్డ్ అయ్యానని పేర్కొన్నాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్ (52: 93 బంతుల్లో 5x4, 1x6) పరుగులు చేసిన విషయం తెలిసిందే.
‘కైల్ జేమీసన్ తొలి సెషన్‌లో గొప్పగా బౌలింగ్ చేశాడు. సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ.. వికెట్లు రాబట్టేందుకు ప్రయత్నించాడు. లంచ్ బ్రేక్ తర్వాత బౌలింగ్‌లో వైవిధ్యం చూపించాడు. రివర్స్ స్వింగ్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఆ బంతులను అంచనా వేయలేక నేను బౌల్డయ్యాను. టెస్టు క్రికెట్లో వీలైనంత త్వరగా పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనదేశంలో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు.. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ సెషన్‌లో ఇద్దరు, ముగ్గురు స్పిన్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటే.. మ్యాచ్‌లో మెరుగ్గా రాణించగలం’ అని శుభ్‌మన్ గిల్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. టీమ్ఇండియా అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (75), రవీంద్ర జడేజా (50) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, టిమ్ సౌథీ ఒక వికెట్ తీసిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.