England : ఆమె ఎప్పటికీ నాదే.. ప్రేయసితో ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ ఎంగేజ్‌మెంట్‌.. !

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్(England women's cricket )‌ తన ప్రేమబంధాన్ని బయటపెట్టింది.  ప్రేయసితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.

Updated : 03 Mar 2023 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌(Danielle Wyatt) ప్రత్యేక వార్త చెప్పారు. తన ఎంగేజ్‌మెంట్‌ (Engagement) గురించి సోషల్‌ మీడియాలో ప్రకటన చేశారు. తన ప్రియురాలితో కలిసున్న ఫొటోను షేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ‘ఆమె ఎప్పటికీ నాదే’ అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటోలో తన భాగస్వామిని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఇక ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కూడా ఇందులో కనిపిస్తోంది.

వ్యాట్‌ ప్రియురాలి పేరు జార్జి హాడ్జ్‌(Georgie Hodge). ఆమె సీఏఏ బేస్‌కు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు హెడ్‌గా ఉన్నారు. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక 31 ఏళ్ల వ్యాట్‌.. ఇంగ్లాండ్‌ తరఫున ఇప్పటి వరకు 102 వన్డేలు, 143 టీ20లు ఆడారు. ఇటీవల వ్యాట్‌.. కేప్‌టౌన్‌లో ప్రఖ్యాత టేబుట్‌ మౌంటేన్‌ కేబుల్‌ కారులో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించి వార్తల్లోకి ఎక్కింది. కేబుల్‌ కారు ఎక్కగానే సాంకేతిక సమస్యలతో అది అటు ఇటు ఊగిందని.. దీంతో తాను ఎంతో భయపడ్డానని తెలిపింది.

ఇక, ఇలా మహిళా ఆటగాళ్లు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి వరకూ వెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కేథరిన్‌ బ్రంట్‌, నటాలియా సీవర్‌ వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్‌-తహుహు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్‌ కాప్‌, డాన్‌ నీకెర్క్‌ కూడా గతంలో దంపతులుగా మారిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని