FIFA World Cup 2022: బంగారు బాబు ఎవరో?

సాకర్‌ సమరంలో విశ్వ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో అర్జెంటీనాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ తలపడుతుంది.

Updated : 17 Dec 2022 08:31 IST

దోహా: సాకర్‌ సమరంలో విశ్వ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో అర్జెంటీనాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ ఫైనల్‌ సమరం రేపే. కప్పు అందుకోవాలన్న మెస్సి కల నెరవేరుతుందా? ఫ్రాన్స్‌ వరుసగా రెండో సారి టైటిల్‌ సాధిస్తుందా.. ఇలా చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్‌తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరా? అన్న ఆసక్తి నెలకొంది. ఈ రేసులో అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సి, ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. తమ జట్లు తుదిపోరు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ఆటగాళ్లు.. చెరో అయిదు గోల్స్‌తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మరి వీళ్లిద్దరిలో ఫైనల్లో ఏ ఆటగాడు గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్తాడో చూడాలి. అల్వారెజ్‌ (అర్జెంటీనా), ఒలీవర్‌ గిరూడ్‌ (ఫ్రాన్స్‌) చెరో నాలుగు గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా.. మెస్సి, ఎంబాపెను దాటి బంగారు బూటు గెలుచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని