Big Bash League: ఇలా క్యాచ్ పడితే.. ఔటా? కాదా?

బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు మైకేల్‌ నీసర్‌ పట్టిన క్యాచ్‌ పెద్ద చర్చకు దారి తీసింది. ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌ ఆటగాడు సిల్క్‌ క్యాచ్‌ను అతను అనూహ్య రీతిలో అందుకున్నాడు.

Updated : 02 Jan 2023 18:58 IST

బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు మైకేల్‌ నీసర్‌ పట్టిన క్యాచ్‌ పెద్ద చర్చకు దారి తీసింది. ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌ ఆటగాడు సిల్క్‌ క్యాచ్‌ను అతను అనూహ్య రీతిలో అందుకున్నాడు. నీసర్‌ క్యాచ్‌ అందుకున్నాక అదుపు తప్పి బౌండరీ లైన్‌ దాటేశాడు. అయితే గాల్లో ఉండగానే అతను బంతిని పైకి విసిరాడు. బౌండరీ దాటి మూణ్నాలుగు అడుగులు అవతలికి వేశాక లైన్‌ అవతలే అతను గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అడుగు కింద పడేలోపు మళ్లీ బంతిని మైదానం లోపలికి విసిరాడు. తిరిగి తాను లైన్‌ దాటి మైదానంలోకి వచ్చాక బంతిని అందుకున్నాడు. రీప్లేలు పరిశీలించాక.. నీసర్‌ ఎక్కడా బౌండరీ అవతల అడుగు పెట్టి బంతిని అందుకున్నట్లు లేకపోవడంతో మూడో అంపైర్‌ ఔటిచ్చాడు. అయితే ఎంత గాల్లోనే బంతిని అందుకున్నప్పటికీ.. బౌండరీకి కొన్ని అడుగుల అవతల నీసర్‌ ఈ విన్యాసాలన్నీ చేయడంతో ఇదెలా ఔట్‌ అవుతుందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి క్యాచ్‌ల విషయంలో నిబంధనలు మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని