లక్ష్య.. నువ్వే నా కొత్త హీరో: గావస్కర్‌

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌కు తాను అభిమానినంటూ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రకటించాడు. నువ్వే నా కొత్త హీరో అంటూ లక్ష్యసేన్‌తో తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమం వేదికగా గావస్కర్‌ పంచుకున్నాడు.

Published : 04 Feb 2023 02:43 IST

దిల్లీ: భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌కు తాను అభిమానినంటూ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రకటించాడు. నువ్వే నా కొత్త హీరో అంటూ లక్ష్యసేన్‌తో తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమం వేదికగా గావస్కర్‌ పంచుకున్నాడు. ‘‘ఒకేఒక్కడు ప్రకాశ్‌ పదుకొణె తర్వాత బ్యాడ్మింటన్‌లో నా కొత్త హీరో లక్ష్యసేన్‌’’ అంటూ ఫొటో కింద గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘‘అంత పెద్ద వ్యక్తి అలా అంటుంటే వినడం ఆనందంగా ఉంది. ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు’’ అంటూ లక్ష్యసేన్‌ మురిసిపోయాడు. బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ)ని గావస్కర్‌ సందర్శించాడు. సన్నీ.. అకాడమీలో యువ క్రీడాకారులు, చిన్నారులతో ముచ్చటించినట్లు పీపీబీఏ డైరెక్టర్‌ విమల్‌కుమార్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని