U19 World Cup 2024: అండర్‌-19 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

అయిదు సార్లు విజేత, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో అండర్‌-19 ప్రపంచకప్‌లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది.

Updated : 23 Sep 2023 09:35 IST

దుబాయ్‌: అయిదు సార్లు విజేత, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో అండర్‌-19 ప్రపంచకప్‌లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీలంకలో జరిగే ఈ టోర్నీ షెడ్యూల్‌ను శుక్రవారం ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 16 జట్లు బరిలో నిలవగా.. గ్రూపు-ఎలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, అమెరికా ఉన్నాయి. గ్రూపు-బిలో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌; గ్రూపు-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా; గ్రూపు-డిలో అఫ్గానిస్తాన్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌ చోటు దక్కించుకున్నాయి. గ్రూపు దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన 12 జట్లు (4 గ్రూపుల్లో) సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆరేసి జట్లను రెండు గ్రూపులుగా విభజించి సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సూపర్‌ సిక్స్‌ దశలో ఇరు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. 1999-2000, 2007-08, 2012, 2017-18, 2021-22లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు