Shubman Gill: ఆసుపత్రి నుంచి గిల్‌ డిశ్చార్జి

డెంగీ జ్వరంతో బాధపడుతున్న భారత బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చెన్నైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు.

Updated : 11 Oct 2023 09:39 IST

దిల్లీ: డెంగీ జ్వరంతో బాధపడుతున్న భారత బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చెన్నైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. కానీ పాకిస్థాన్‌తో శనివారం జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్‌ ఆదివారం ఆసుపత్రిలో చేరాడు. ‘‘గిల్‌ ప్లేట్లెట్ల సంఖ్య 70 వేలకు తగ్గిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అతణ్ని ఆసుపత్రిలో చేర్చారు. అతడికి అవసరమైన అన్ని పరీక్షలు చేశారు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని