David Warner: కోచ్‌గా మారాలనుకుంటున్నా: డేవిడ్‌ వార్నర్‌

భవిష్యత్తులో కోచ్‌గా మారాలనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు.

Updated : 08 Jan 2024 07:18 IST

సిడ్నీ: భవిష్యత్తులో కోచ్‌గా మారాలనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఐపీఎల్‌ వంటి దేశీయ లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లు పంచుకుంటుండటంతో పదేళ్లలో స్లెడ్జింగ్‌ దూరమవుతుందని అభిప్రాయపడ్డాడు. టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికిన వార్నర్‌ టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ‘‘నాకో ఆశయం ఉంది. క్రికెట్‌ కెరీర్‌ తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. మొదట నా భార్యతో మాట్లాడాలి. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతిస్తుందో లేదో చూడాలి. జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి చూసేవాడిని. వారు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కలవరపెట్టడం ద్వారా లయను దెబ్బతీసేవాడిని. జట్టు నన్ను అలాగే తీర్చిదిద్దింది. ఇకపై అలాంటి స్లెడ్జింగ్‌ చూస్తారని అనుకోను. వచ్చే అయిదు, పదేళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్‌ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు’’ అని వార్నర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని