భారత అమ్మాయిలదే రెండో టీ20

బంగ్లాదేశ్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

Published : 01 May 2024 02:11 IST

సిల్‌హట్‌ (బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన రెండో మ్యాచ్‌లో హర్మన్‌ సేన డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 19 పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రాధ యాదవ్‌ (3/19), దీప్తి శర్మ (2/14), శ్రేయాంక పాటిల్‌ (2/24) బంగ్లాను కట్టడి చేశారు. ముర్షిదా ఖాతూన్‌ (46) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌. లక్ష్యఛేదనలో 5.2 ఓవర్లలో భారత్‌ 47/1తో ఉన్న దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఇక మ్యాచ్‌ జరిగే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం.. అప్పటికి లక్ష్యం (28 పరుగులు) కంటే 19 పరుగులు ఎక్కువ స్కోరు చేసిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌ సాధించిన 47 పరుగుల్లో 41 హేమలత సాధించినవే కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని