T20 WC 2024 - Australia: కెప్టెన్‌గా మార్ష్‌.. యంగ్ సెన్సేషన్‌కు నో ఛాన్స్‌.. ఆసీస్‌ జట్టు ఇదే!

టీ20 ప్రపంచ కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను సారథిగా నియమించింది.

Updated : 01 May 2024 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 World Cup 2024) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా (Australia) తన జట్టును ప్రకటించింది. పాట్ కమిన్స్‌ స్థానంలో కెప్టెన్‌గా మిచెల్ మార్ష్‌ను (Mitchell Marsh) నియమించింది. సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు చోటు దక్కలేదు. పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆల్‌రౌండర్ మాట్ షార్ట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొట్టేస్తున్న జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌కు అనుభవలేమితో జట్టులో స్థానం కల్పించలేకపోయింది. ఆల్‌రౌండర్ల జాబితాలో మార్కస్‌ స్టాయినిస్‌, కామెరూన్ గ్రీన్‌కు అవకాశం దక్కింది. వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు తెలిపిన డేవిడ్ వార్నర్‌ను ప్రపంచ కప్ స్క్వాడ్‌లోకి తీసుకుంది. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న గ్లెన్‌ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌కు అవకాశం దక్కడం గమనార్హం. జట్టు ప్రకటన అనంతరం సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్‌ బెయిలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘వరల్డ్‌ కప్‌ కోసం అనుభవం కలిగిన జట్టును ఎంపిక చేశాం. జట్టులోని ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నాం. 15 మందితోనే స్క్వాడ్‌ను వెల్లడించాల్సిన పరిస్థితుల్లో కొందరు నాణ్యమైన క్రికెటర్లకు అవకాశం కల్పించలేకపోయాం. స్టీవ్‌ స్మిత్, షార్ట్, జాసన్, హార్డీ, స్పెన్సర్ జాన్సన్, బార్టీ, ఫ్రేజర్.. ఇలా టీ20 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన వారికి చోటు ఇవ్వలేకపోయాం. తప్పకుండా వారిద్దరిని గమనిస్తూనే ఉంటాం. వారి ప్రదర్శనకు తగిన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెయిలీ తెలిపాడు. 

ఆస్ట్రేలియా: అస్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, జోష్‌ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్‌ జంపా


ఇప్పటికే ప్రకటించిన టీమ్‌లు ఇవే..

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్‌ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, బుమ్రా, సిరాజ్. ట్రావెల్ రిజర్వ్‌: గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్‌ ఖాన్

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసి, ట్రిస్టన్ స్టబ్స్. ట్రావెలింగ్ రిజర్వ్: నంద్రి బర్గర్, లుంగి ఎంగిడి. 

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్. 

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌, ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బ్రాస్‌వెల్‌, చాప్‌మన్‌, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డరిల్‌ మిచెల్‌, నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్ శాంట్నర్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ.

అఫ్గానిస్థాన్‌: ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నంగ్యాల్ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, గుల్బాదిన్ నయిబ్‌, కరీమ్‌ జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్‌ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖి, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని