10 రోజులు ధావన్‌ దూరం!

భుజం గాయంతో పంజాబ్‌ కెప్టెన్‌ ధావన్‌ కనీసం వారం- పది రోజులు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ సంజయ్‌ బంగర్‌ తెలిపాడు.

Published : 15 Apr 2024 02:14 IST

ముల్లాన్‌పూర్‌ (చండీగఢ్‌): భుజం గాయంతో పంజాబ్‌ కెప్టెన్‌ ధావన్‌ కనీసం వారం- పది రోజులు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ సంజయ్‌ బంగర్‌ తెలిపాడు. శనివారం రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ధావన్‌ దూరమవడంతో సామ్‌ కరన్‌ సారథ్యం వహించాడు. ‘‘ధావన్‌ భుజానికి గాయమైంది. ఎంతో అనుభవం కలిగిన ధావన్‌ జట్టులో ఉండటం చాలా కీలకం. ప్రస్తుత  పరిస్థితుల్లో 7-10 రోజులు అతను ఆటకు దూరంగా ఉండొచ్చు’’ అని బంగర్‌ పేర్కొన్నాడు.


పలక్‌కు ఒలింపిక్‌ కోటా స్థానం

దిల్లీ: షూటింగ్‌లో భారత్‌కు మరో   ఒలింపిక్‌ కోటా స్థానం దక్కింది. ఆదివారం రియోడిజనీరోలో జరిగిన ఒలింపిక్‌ అర్హత పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో కాంస్యం గెలిచిన యువ షూటర్‌ పలక్‌ గులియా పారిస్‌ బెర్తు సంపాదించింది. ఫైనల్‌కు పలక్‌, సైన్యం అర్హత సాధించినా.. సైన్యం అయిదో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఇది భారత్‌కు దక్కిన 20వ ఒలింపిక్‌ కోటా. ఏప్రిల్‌ 19న దోహాలో ఆరంభమయ్యే షాట్‌గన్‌ క్వాలిఫికేషన్‌ ఈవెంట్లో మరో నాలుగు స్థానాలు సాధించేందుకు భారత్‌కు ఇంకా అవకాశం ఉంది.


సుల్తాన్‌కు స్వర్ణం

దిల్లీ: అఖిల భారత మానవ్‌ రచన ఓపెన్‌ షాట్‌గన్‌ టోర్నీలో ఫాహద్‌ సుల్తాన్‌ ట్రాప్‌ స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో అతను 42 స్కోర్‌ చేశాడు. ప్రభాత్‌ కుమార్‌ (37) రజతం, ఆర్యవంశ్‌ త్యాగి (31) కాంస్యం సాధించారు. ఫైనల్లో ఆరుగురు పోటీపడ్డారు. క్వాలిఫికేషన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలకు ఫైనల్‌కు అర్హత కల్పించడం ఈ పోటీ ప్రత్యేకత. ఆద్య త్రిపాఠి, భావన చౌదరి, కథ కపూర్‌ ఫైనల్లో పోటీపడ్డ మహిళా షూటర్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని