Updated : 19 Oct 2021 07:51 IST

Afghanistan: అక్కడ కల్లోలం.. ఇక్కడ పోరాటం

దుబాయ్‌

తమ దేశంలో మరోసారి తాలిబన్ల పాలనతో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డా.. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. భయాందోళనలో ఉన్న దేశ ప్రజలకు తమ ఆటతో కాస్త ఉపశమనాన్ని అందించేందుకు రంగంలోకి దిగుతున్నారు. పసికూన అనే ముద్రను చెరిపేసుకుని అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న ఈ జట్టు.. అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

అంతర్జాతీయ క్రికెట్లో.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌ మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. అందుకే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫయర్స్‌తో అవసరం లేకుండా ఈ ప్రపంచకప్‌లో నేరుగా సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడే అవకాశం కొట్టేసింది. భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్‌- 2లో ఉన్న ఆ జట్టు.. కనీసం ఒక్క విజయమైనా సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ అగ్రశ్రేణి జట్లను ఓడించి.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లోపు నిలిచి అఫ్గాన్‌ సెమీస్‌ చేరడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ జట్టు ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. ఇటీవల కాలంలో ఆ జట్టు పెద్దగా టీ20 మ్యాచ్‌లాడలేదు. కానీ ఆడిన గత మూడు సిరీస్‌ల్లోనూ (వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే) గెలిచింది. ముఖ్యంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విండీస్‌పై సిరీస్‌ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఆశలన్నీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మీదే ఉన్నాయి. తన ప్రమేయం లేకుండానే జట్టును ఎంపిక చేశారని ఒక్క మ్యాచ్‌కూ నాయకత్వం వహించకుండానే టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన రషీద్‌.. బంతితో జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరో స్పిన్నర్‌ ముజీబ్‌ కూడా ప్రమాదకారే. ఇక నంబర్‌వన్‌ టీ20 ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబి.. బ్యాట్‌, బంతితో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లోనే నిలకడగా రాణించే ఆటగాడు లేకపోవడం ఇబ్బందిగా మారింది. గుర్బాజ్‌, హజ్రతుల్లా, అస్గర్‌ లాంటి బ్యాటర్లపైనే ఆ జట్టు నమ్మకం పెట్టుకుంది.


కీలక ఆటగాళ్లు: రషీద్‌, ముజీబ్‌, నబి, గుర్బాజ్‌
అత్యుత్తమ ప్రదర్శన: సూపర్‌- 10 (2016)
అఫ్గానిస్థాన్‌ జట్టు: నబి (కెప్టెన్‌), అస్గర్‌, ఫరీద్‌, గుల్బాదిన్‌, హమీద్‌, హష్మతుల్లా, హజ్రతుల్లా, కరీమ్‌, షాజాద్‌, ముజీబ్‌, జాద్రాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, గుర్బాజ్‌, రషీద్‌, ఉస్మాన్‌.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని