VVS Laxman:ఇలా చూడటం గొప్పగా ఉంది

వివిధ కారణాల వల్ల  సరైన సన్నాహకం లేనప్పటికీ  భారత్‌ అండర్‌-19 కుర్రాళ్లు సాధించిన ఆసియా కప్‌ విజయం మరింత ప్రశంసనీయమైందని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

Updated : 02 Jan 2022 07:18 IST

దిల్లీ: వివిధ కారణాల వల్ల  సరైన సన్నాహకం లేనప్పటికీ  భారత్‌ అండర్‌-19 కుర్రాళ్లు సాధించిన ఆసియా కప్‌ విజయం మరింత ప్రశంసనీయమైందని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన యువ భారత్‌ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కుర్రాళ్లపై లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ నెల 14న వెస్టిండీస్‌లో ఆరంభమయ్యే  అండర్‌-19 ప్రపంచకప్‌కు ముందు ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపాడు.  ‘‘ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత్‌ అండర్‌-19 జట్టుకు అభినందనలు. ప్రతికూల వాతావరణంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ టోర్నీకి ముందు వాళ్ల సన్నాహకం దెబ్బతింది. కానీ ఈ కుర్రాళ్లు మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతుంటే చూడడం గొప్పగా ఉంది. అది టైటిల్‌ విజయంతో సమానంగా సంతృప్తినిస్తోంది. అండర్‌-19 ప్రపంచకప్‌కు ముందు ఈ గెలుపు వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని