Deepa Karmakar: దీప సస్పెండ్‌ అయ్యిందా!

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ సస్పెండ్‌ అయ్యిందా! ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య వెబ్‌సైట్‌ చూస్తే ఈ అనుమానం కలుగక మానదు. ప్రస్తుతం ఆడుతున్న

Published : 01 Mar 2022 08:13 IST

దిల్లీ: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ సస్పెండ్‌ అయ్యిందా! ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య వెబ్‌సైట్‌ చూస్తే ఈ అనుమానం కలుగక మానదు. ప్రస్తుతం ఆడుతున్న భారత జిమ్నాస్ట్‌ల జాబితాలో దీప పేరు ఎదురుగా సస్పెండ్‌ అని ఉండగా.. మిగిలిన జిమ్నాస్ట్‌లకు యాక్టివ్‌ అని కనిపిస్తోంది. దీనిపై భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్యకు ఎలాంటి సమాచారం లేదు. ‘‘వెబ్‌సైట్‌లో దీప సస్పెన్షన్‌ అని ఉంచడంపై ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య నుంచి మాకెలాంటి సమాచారం లేదు. వాళ్ల నుంచి సమాచారం వచ్చాకే మేం ఏదైనా మాట్లాడగలం’’ అని భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌ మిత్తల్‌ చెప్పాడు. 2016లో రియో ఒలింపిక్స్‌లో వాల్ట్‌లో నాలుగో స్థానం సాధించిన దీప.. 2019 నుంచి ఏ పోటీలో పాల్గొనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని