Wriddhiman Saha: సాహా ఆ జర్నలిస్ట్‌ పేరు చెప్పేశాడు..

ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఓ పాత్రికేయుడు తనను బెదిరించాడని ఆరోపించిన వెటరన్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. అతడి వివరాలను బీసీసీఐ కమిటీకి వెల్లడించాడు. సాహా ఆరోపణలపై విచారణ జరిపేందుకు బోర్డు ముగ్గురు సభ్యుల

Updated : 06 Mar 2022 10:21 IST

దిల్లీ: ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఓ పాత్రికేయుడు తనను బెదిరించాడని ఆరోపించిన వెటరన్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. అతడి వివరాలను బీసీసీఐ కమిటీకి వెల్లడించాడు. సాహా ఆరోపణలపై విచారణ జరిపేందుకు బోర్డు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘‘నాకు తెలిసిందంతా కమిటీకి చెప్పా. వివరాలను వాళ్లతో పంచుకున్నా. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఇప్పుడు మీకు చెప్పలేను’’ అని సాహా విలేకర్లతో చెప్పాడు. సాహాతో సంభాషించిన మాట నిజమే గానీ.. అతడు తన సందేశాలు టాంపర్‌ చేశాడని బోరియా మజుందార్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని