మెరిసిన హర్మన్‌, మంధాన

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31 నాటౌట్‌; 32 బంతుల్లో 24), స్మృతి మంధాన (39; 34 బంతుల్లో 84) సత్తా చాటడంతో శనివారం రెండో టీ20లో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో లంకను ఓడించింది.

Updated : 26 Jun 2022 03:12 IST

టీ20 సిరీస్‌ భారత్‌ సొంతం

దంబుల్లా: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31 నాటౌట్‌; 32 బంతుల్లో 24), స్మృతి మంధాన (39; 34 బంతుల్లో 84) సత్తా చాటడంతో శనివారం రెండో టీ20లో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 50 బంతుల్లో 64), చమరి ఆటపట్టు (43; 41 బంతుల్లో 74, 16) తొలి వికెట్‌కు 87 పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చారు. కానీ వీళ్లిద్దరూ వెనుదిరిగాక లంక తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఒక దశలో 87/0తో ఉన్న లంక 38 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ రెండు వికెట్లు తీయగా.. రేణుక, రాధ, పూజ, హర్మన్‌ప్రీత్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 5.4 ఓవర్లలో 48/2తో నిలిచింది. షెఫాలీవర్మ (17), సబ్బినేని మేఘన (17) త్వరగా పెవిలియన్‌ చేరారు. ఈ స్థితిలో స్మృతి, హర్మన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మంధానతో పాటు జెమీమా (3), యస్తికా (13) వికెట్లు పడినా.. దీప్తిశర్మ (5 నాటౌట్‌)తో కలిసి హర్మన్‌ జట్టును గెలిపించింది. భారత్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని